A Quarterly Research Journal త్రైమాసిక పరిశోధన పత్రిక
ISSN 2278 - 2060 Telugu Research
పరిశోధకులకు ఆహ్వానం
పరిశోధన అనేది నిరంతరాయంగా సాగుతూండే అనంతమైన గవేషణ. తెలుగు భాషా సాహిత్యాలలో పరిశోధన శతాబ్దాలుగా సాగుతూ వస్తూ ఉంది. ఇప్పటికీ కొనసాగుతూంది. ఎందరో మహానుభావులు మహా పరిశోధకులు కృషి చేసి అమూల్య సంపదలను మనకందించారు. తెలుగులో పరిశోధన విశ్వవిద్యాలయాలలో మొదలై దాదాపు ఎనబై సంవత్సరాలైంది. 1930లో వచ్చిన చిలుకూరు నారాయణ రావుగారిది తొలి సిద్ధాంత గ్రంథంగా తెలుస్తూ ఉంది. అప్పటినుండి ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాలలో పరిశోధన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వివిధ స్థాయిలలో సిద్ధాంత గ్రంథాలు వస్తున్నాయి. తెలుగు పరిశోధనలో రాసి పెరిగింది వాసి తగ్గింది అనే విమర్శ సహేతుకంగా నిలబడినా మంచి సిద్ధాంత గ్రంథాలు వస్తున్నాయి, మంచి పరిశోధనా జరుగుతూనే ఉంది.
తెలుగులో జరిగే పరిశోధనకు భూమికగా ఉండే పత్రికలు కూడా చాలా వచ్చాయి. జయంతి భారతి తెలుగు వాఙ్మయి వంటి పత్రికలు పరిశోధనకు ఎంతో సేవ చేసాయి. రెండు తప్ప అన్నీ మూల పడ్డాయి. అదృశ్యమయ్యాయి.
అచ్చులో వచ్చే పుస్తకాలు చాలా పరిమితమైన పరిధిలోనే ప్రచారంలో ఉంటాయి. అవి రాష్ట్రం సరిహద్దు దాటటం కూడా చాలా కష్టమే. కాని నేడు సమాజానికి అందుబాటులోనికి వచ్చిన అంతర్జాలం లేదా ఇంటర్ నెట్ అనే పరిజ్ఞానం అన్ని ఎల్లలను చెరిపివేసింది. ఒక భావన కవికి కాని పరిశోధకునికి గాని వస్తే అది క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా చేయగలిగిన సాంకేతికత ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆసరా చేసుకొని తెలుగు పరిశోధన ఎప్పటికప్పుడు ప్రపంచానికి మొత్తానికి అందుబాటులోనికి తేవాలనే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను.
ఇందులో వ్యాసాలు భాషా సాహిత్యాలు, చరిత్ర, సంస్కృతి, జానపదవిజ్ఞానం, కళలు తదితర అంశాలపైన ఉండవచ్చు. వీటిని పత్రికలో ప్రచురించడంతోపాటు పుస్తక సమీక్షలు చర్చలు కూడా ఉంటాయి. ఈ చర్చా వేదిక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ఉన్న పండితులు పరిశోధకులు పాల్గొనే వీలుకలిగిస్తుంది. అంతే కాదు విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనను ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంచి జరిగినదానిపైన జరగకుండా పాడింది పాడకుండా తోడ్పడడం జరుగుతుంది. దీనిద్వారా పరిశోధన తీరుకూడా తెలియవస్తుంది.
తెలుగు పరిశోధకులు అందరికీ చాలా అనుభవజ్ఞుల వద్దనుండి విద్యార్థి పరిశోధకుల వరకూ అందరూ పాల్గొనాలని దీనిలో తమ పరిశోధనలను ప్రచురించుకోవలసిందిగా ఆహ్వానం. ఇది ఉచితంగా లభించే పత్రిక చందాలు లేవు. పరిశోధకులు తమ వ్యాసాలను యూనికోడ్ ఫాంట్ లో డి.టి.పి చేయించి పంపాలి. రాత ప్రతులను డి.టి.పి చేయించుకునే ఆర్థిక వనరులు మా వద్ద లేవు. వ్యాసాలు సమీక్షలు తదితర విషయాలన్నీ నా ఇ-మెయిల్ కు పంపవచ్చు. ఈ వివరాలను చిరునామా బటన్ దగ్గర పైన చూడండి. మరొక్కసారి తెలుగు అంతర్జాల ప్రపంచంలోనికి పత్రికలోనికి ఆహ్వానం పలుకుతున్నా.
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.
ప్రత్యేక ప్రకటన: ఇందులోని వ్యాసాలలోని అంశాలు ఆయా అభిప్రాయాలు పత్రిక అభిప్రాయాలు కావలసిన అవసరంలేదు. ఇవి ఆయా రచయితల అభిప్రాయాలు సిద్ధాంతాలుగానే భావించాలి.
Special Note: The Ideas, Social stands and other theoretical propositions appeared in the articles need necessarly of the Journal or the Editorial Board. They belong to Authors of the papers.
A Quarterly Research Journal త్రైమాసిక పరిశోధన పత్రిక
ISSN 2278 - 2060 Telugu Research
పరిశోధకులకు ఆహ్వానం
తెలుగులో జరిగే పరిశోధనకు భూమికగా ఉండే పత్రికలు కూడా చాలా వచ్చాయి. జయంతి భారతి తెలుగు వాఙ్మయి వంటి పత్రికలు పరిశోధనకు ఎంతో సేవ చేసాయి. రెండు తప్ప అన్నీ మూల పడ్డాయి. అదృశ్యమయ్యాయి.
అచ్చులో వచ్చే పుస్తకాలు చాలా పరిమితమైన పరిధిలోనే ప్రచారంలో ఉంటాయి. అవి రాష్ట్రం సరిహద్దు దాటటం కూడా చాలా కష్టమే. కాని నేడు సమాజానికి అందుబాటులోనికి వచ్చిన అంతర్జాలం లేదా ఇంటర్ నెట్ అనే పరిజ్ఞానం అన్ని ఎల్లలను చెరిపివేసింది. ఒక భావన కవికి కాని పరిశోధకునికి గాని వస్తే అది క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా చేయగలిగిన సాంకేతికత ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆసరా చేసుకొని తెలుగు పరిశోధన ఎప్పటికప్పుడు ప్రపంచానికి మొత్తానికి అందుబాటులోనికి తేవాలనే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను.
ఇందులో వ్యాసాలు భాషా సాహిత్యాలు, చరిత్ర, సంస్కృతి, జానపదవిజ్ఞానం, కళలు తదితర అంశాలపైన ఉండవచ్చు. వీటిని పత్రికలో ప్రచురించడంతోపాటు పుస్తక సమీక్షలు చర్చలు కూడా ఉంటాయి. ఈ చర్చా వేదిక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ఉన్న పండితులు పరిశోధకులు పాల్గొనే వీలుకలిగిస్తుంది. అంతే కాదు విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనను ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంచి జరిగినదానిపైన జరగకుండా పాడింది పాడకుండా తోడ్పడడం జరుగుతుంది. దీనిద్వారా పరిశోధన తీరుకూడా తెలియవస్తుంది.
తెలుగు పరిశోధకులు అందరికీ చాలా అనుభవజ్ఞుల వద్దనుండి విద్యార్థి పరిశోధకుల వరకూ అందరూ పాల్గొనాలని దీనిలో తమ పరిశోధనలను ప్రచురించుకోవలసిందిగా ఆహ్వానం. ఇది ఉచితంగా లభించే పత్రిక చందాలు లేవు. పరిశోధకులు తమ వ్యాసాలను యూనికోడ్ ఫాంట్ లో డి.టి.పి చేయించి పంపాలి. రాత ప్రతులను డి.టి.పి చేయించుకునే ఆర్థిక వనరులు మా వద్ద లేవు. వ్యాసాలు సమీక్షలు తదితర విషయాలన్నీ నా ఇ-మెయిల్ కు పంపవచ్చు. ఈ వివరాలను చిరునామా బటన్ దగ్గర పైన చూడండి. మరొక్కసారి తెలుగు అంతర్జాల ప్రపంచంలోనికి పత్రికలోనికి ఆహ్వానం పలుకుతున్నా.
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.
ప్రత్యేక ప్రకటన: ఇందులోని వ్యాసాలలోని అంశాలు ఆయా అభిప్రాయాలు పత్రిక అభిప్రాయాలు కావలసిన అవసరంలేదు. ఇవి ఆయా రచయితల అభిప్రాయాలు సిద్ధాంతాలుగానే భావించాలి.
Special Note: The Ideas, Social stands and other theoretical propositions appeared in the articles need necessarly of the Journal or the Editorial Board. They belong to Authors of the papers. |